![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -434 లో.. భవాని దగ్గరికి వెళ్ళి జరిగినవన్నీ చెప్తుంది. తను ఆదర్శ్ మంచికోసమే చేసిందని కృష్ణ తప్పేం లేదని భవాని అంటుంది. ఇక అదేసమయంలో వదినా అనే పిలిచిన పిలుపు.. అరుపులా వినిపిస్తుంది. దాంతో భవానీ, కృష్ణ గది నుండి బయటికి వస్తారు . రేవతి, సుమలత, మధు అంత ఆ అరుపులకు బయటికి వస్తారు. అయితే బ్యాగ్ పట్టుకుని ఓ తల్లీకూతుర్లు హాల్లో నిలబడి ఉంటారు. ఆ వచ్చిన వాళ్లను.. కృష్ణ తప్ప అంత తెలిసిన ముఖాలని చూసినట్లే చూస్తుంటారు.
భవాని, రేవతి, సుమలతలని వదిన.. వదిన.. అంటూ పిలుస్తూ ఉంటుంది కొత్తగా వచ్చిన ఆమె. తను రజినీ.. భవానికి ఆడపడుచు. బాగున్నావా రజినీ వదిన అని రేవతి అంటుంది. హా.. బాగానే ఉన్నాం.. మేము వస్తేనే కానీ ఈ పలకరింపుకు దిక్కులేదు. నా మొగుడు వదిలేసిపోయాడు. ఏదో తండ్రిలేని పిల్లతో బతుకుతున్నాను.. అదికూడా నీ పెద్ద కోడలు ముకుంద పోయిందట కదా.. అది తెలుసుకునే వచ్చామని రజినీ అంటుంది. ఆ మాటలకి రజినీవైపు అంతా షాక్ అవుతు చూస్తుంటారు. హా.. అదే పరామర్శించడానికి వచ్చామని చెబుతున్నాను.. అయినా నా కూతురు సంగీతను నీ కోడల్ని చేసుకోమని చిలక్కి చెప్పినట్లు చెప్పాం వదినా నువ్వు విన్నావా అని రజినీ అనగానే.. నేను చూసుకుంటానని భవాని అంటుంది. హా ఏం చూసుకున్నావ్.. ముకుంద శవం అయింది. ఇదిగో ఈ ఆదర్శ్ తాగుబోతు అయ్యాడని అప్పుడే ఫుల్ గా తాగేసి వచ్చిన ఆదర్శ్ ని చూపిస్తూ రజినీ అంటుంది. దాంతో ఆదర్శ్ ని లోపలికి వెళ్ళమని భవాని కోప్పడుతుంది. రజినీ మాటలు విన్న కృష్ణకు కోపం వస్తుంది. పిన్నీ మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అని కృష్ణ కోపంగా అంటుంది. హేయ్.. ఎవరివే నువ్వు? ఇది నా అన్న ఇల్లు.. నా వదిన ఇల్లు.. నా ఇష్టం వచ్చినట్లు ఉంటా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతా అని రజినీ అంటుంది. మీరు ఎవ్వరైనా కానివ్వండి. ఏం అయినా మాట్లాడండి.. కానీ.. మా పెద్ద అత్తయ్యను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎవరికీ లేదు. మీరు బంధువులు కాబట్టి వదిన అని పిలవండి సరిపోతుంది. లేని చొరవ తెచ్చుకుని పేరు పెట్టి పిలిచారో మా పెద్దత్తయ్య ఊరుకుంటుందేమో కానీ నేను అసలు ఊరుకోనని కృష్ణ అంటుంది.
ఆదర్శ్ మరదలు సంగీత.. తాగుతూ ఉన్న తన బావ దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ వెళ్లు అని ఆదర్శ్ అన్నా వినకుండా.. సంగీత రొమాంటిక్గా మాట్లాడుతుంది. ఆ మందుబాటిల్ పక్కన పెట్టి.. సరిగ్గా నన్ను చూడు బావా.. ఆ మత్తు కన్నా నా కళ్లల్లోకి చూస్తే కలిగే మత్తే ఎక్కువ.. చూడు బావా అంటు అదర్శ్ గడ్డం పట్టుకుని మరీ ఆమె కళ్లల్లోకి చూసేలా చేసుకుంటుంది సంగీత. ఆదర్శ్ క్షణం పాటు అలా సంగీత కళ్లల్లోకి చూస్తూనే ఉండిపోతాడు. ఎలా ఉంది బావ అని సంగీత అంటుంది. సంగీతని తోసినట్లుగా.. మూసుకుని వెళ్లు అని కోపంగా అంటాడు. అయిన వదలదు. కొంటెగా రొమాంటిక్గా మాట్లాడుతూనే ఉంటుంది. ఆదర్శ్ కోపంగా తిట్టేయడంతో.. తప్పక వెళ్లిపోతుంది. ఇప్పుడు తాగుతున్నావ్ కాబట్టి వదిలేస్తున్నా.. నిన్ను వదలనని సంగీత తన మనసులో అనుకుంటుంది. మరి ఈ సీరియల్ లో సంగీత, రజినీ ఎంట్రీలతో ఏం జరగనుందో ముందు ముందు తెలుస్తుంది.
![]() |
![]() |